STIలను నేనెలా నివారించగలను
From Audiopedia
STIలు నివారించడం వల్ల మిమ్మల్ని మీరు మరియు మీ భాగస్వామిని తీవ్రమైన అనారోగ్యం మరియు వంధ్యత్వం నుండి రక్షించుకోవచ్చు:
సురక్షితమైన లైంగిక చర్య అభ్యసించండి.
మీరు లైంగిక చర్యలో పాల్గొన్న ప్రతిసారి కండోమ్ ఉపయోగించండి. స్త్రీ మరియు పురుష కండోమ్‌లనేవి:
మీరు లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు వీటిలో ఏదో ఒకటి ఉపయోగించండి - రెండూ ఒకేసారి ఉపయోగించకూడదు.
మీ భాగస్వామి కండోమ్ ఉపయోగించకపోతే, డయాఫ్రాగమ్ ఉపయోగించడం ద్వారా కొన్ని రకాల STIల నుండి, ప్రత్యేకించి గనేరియా మరియు క్లమీడియా నుండి రక్షణ లభిస్తుంది.
యోని ద్వారా సెక్స్ బదులుగా, మీరు మరియు మీ భాగస్వామి నోటి ద్వారా లేదా ఇతర రకాల స్పర్శ ద్వారా సంతృప్తి చెందవచ్చు.
మీకు లేదా మీ భాగస్వామికి STI సంకేతాలు ఉన్నప్పుడు లైంగిక ప్రక్రియలో పాల్గొనకండి.